విశాఖ-కేరళకు విమాన సర్వీసు
విశాఖపట్నం నుంచి కేరళకు విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. విశాఖ నుంచి ఎర్నాకుళం (కోచి)కి విమాన సర్వీసును నిర్వహించేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ముందుకొచ్చింది. డిసెంబరు 1వ తేదీ నుంచి ఈ సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి టికెట్ బుకింగ్స్‌ను ఇండిగో ప్రారంభించింది. ఈ విమాన సర్వీసు మధ్యాహ్నం 2:10 గంటలకు కోచిలో బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి రాత్రి ఏడు గంటలకు కోచి చేరుకుంటుంది. శబరిమలై వెళ్లే భక్తులకు ఈ విమాన సర్వీసు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని ఇండిగో భావిస్తోంది.













