భారత్ కు శుభవార్త చెప్పిన అమెరికా !
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల పునరుద్ధరణ నేపథ్యంలో భారతదేశానికి ఊరట లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఎనిమిది దేశాలకు మినహాయింపునిచ్చేందుకు అమెరికా అంగీకరించినట్లు ఓ వార్త సంస్థ పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా పునరుద్ధరించిన ఆంక్షలు వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాలు ఆసియాలో ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఇరాన్ నుంచి చమురు దిగుమతులకు వీలుగా ఆంక్షల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి.
భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా చమురు కోసం ఇరాన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన దేశాల జాబితాను అమెరికా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో చైనా కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.













