ఈ నెల 29న ఉద్యమ సింహం
కేసీఆర్ నేతృత్వంలో సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం ఆధారంగానే ఉద్యమసింహం రూపొందించామన్నారు అల్లూరి కృష్ణంరాజు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నటరాజన్, మాధవిరెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్యపాత్రలు పోషించారు. కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మాత. చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఎలా పోరాటం చేశారు? ఆయన సంకల్ప బలం ఎలాంటిదనే అంశాలతో ఈ చిత్రం రూపొందిందన్నార. నిర్మాత మాట్లాడుతూ కేసీఆర్ పాత్రలో నటరాజన్ బాగా నటించారన్నారు. కల్వకుంట్ల కవిత పాత్రలో నటించడం ఆనందంగా ఉందన్నారు లత. ఈ కార్యక్రమంలో కృష్ణ రాపోలు, సాహిత్య ప్రకాష్, సూర్య, మల్లికార్జునరావు, విఠల్, రాములు తదితరులు పాల్గొన్నారు.













