సమంతకు మాత్రమే సాధ్యం
రివ్యూలు, రేటింగ్స్ బాగున్నప్పటికీ, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల యు టర్న్ చిత్రం పబ్లిసిటీ మరింత పెంచారు యూనిట్ సభ్యులు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగా ఉంది అంటున్నారని, సమంత ఈ సినిమాలో చాలా డిఫరెంట్ కనిపించిందని అన్నారు. రంగస్థలంలో ఒకలా, యూ టర్న్‌లో మరోలా వేరియేషన్స్ చూపించడం సమంతకు మాత్రమే సాధ్యమని కవిత పేర్కొన్నారు. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సమంతాతోపాటు, యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













