ఫోటోలు తీయోద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె తండ్రి కృష్ణారాజ్ రాయ్ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన జయంతి సందర్భంగా తన తండ్రి కోసం ముంబైకి చెందిన స్మైల్ ఫౌండేషన్ ద్వారా గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించారు. ఐశ్వర్య తండ్రి కూడా గ్రహణం మొర్రి సమస్యతోనే జన్మించారట. దీంతో ఆమె చిన్నారులకు సర్జరీ చేయించారు. అనంతరం ఆ పిల్లల ఆధ్వర్యంలోనే తన తండ్రి జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. విషయం తెలుసుకున్న మీడియా వర్గాలు అక్కడికి చేరుకుని ఆమె ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. దీంతో ఉద్వేగానికి గురైన ఐష్. ప్లీజ్ నా ఫోటోలు తీయకండి. ఇది మూవీ ప్రీమియర్ షో కాదు. పబ్లిక్ ఈవెంట్ అంతకన్నా కాదు. అసలు నేనే ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలీయదు. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు.













