లోకేష్ వల్లే ఏపీకి ఐటీ కంపెనీలొస్తున్నాయి
నారా లోకేష్‌ను మంత్రిగా తీసుకోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మూట్లాడుతూ నిరుద్యోగ భృతి అమలుతో టీడీపీ మేనిఫెస్టో 90 శాతం అమలైనట్లేనని చెప్పారు. నిరుద్యోగ భృతి చాలా రాష్ట్రాల్లో విఫలమైందన్నారు. బీజేపీ నేత సోము వీర్రాజు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వీర్రాజు వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు కల్గుతున్నాయన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం తెలుసుకుంటుందన్నారు. అలాగే ప్రజల్లో మమేకం అవ్వడానికి గ్రామదర్శిని ప్రజాప్రతినిధులకు ఒక మంచి అవకావం అని తెలిపారు.













