2019 ఎన్నికల్లో టీడీపీ విజయం : బుద్ధా
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆరో డివిజన్లో గ్రామదర్శిని, గ్రామ వికాసం క్యాక్రమాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. 150 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. చంద్రబాబు పాలనపై 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమని అన్నారు.













