విశాఖలో జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఈ నెల 17న విశాఖ పోర్టు స్టేడియంలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో జాతీయ సినీ అవార్డ్సు 2017-18 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు, హిందీ, పంజాబీ, కన్నడ సినీ పరిశ్రమలకు సంబంధించి 60 మంది వరకు నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్‌బాబుతో పాటు 27 మంది సినీ హీరోలు, 15 మంది కథానాయికలు, హాస్యనటుడు బ్రహ్మానందం వస్తున్నారన్నారు. శ్రీదేవి స్మారక అవార్డుకు నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేశామన్నారు 14వ తేదీన అవార్డులకు ఎంపిక చేసిన జాబితాను విడుదల చేస్తామన్నారు.













