విజయవాడ నుంచి కొచ్చికి స్పైస్ జెట్ సేవలు
విజయవాడ విమానాశ్రయం నుంచి కేరళలోని కొచ్చికి నూతన విమాన సర్వీసు త్వరలో ప్రారంభం కాబోతోంది. మార్చి 1 నుంచి తిరుపతి మీదుగా కొచ్చికి విమాన సర్వీసును స్పెస్ జెట్ విమాన సంస్థ ప్రారంభించనుంది. ఇప్పటికే టికెట్లు విక్రయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు టికెట్ ధర ఉంది. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి ఏటా ప్రయాణికులు పెద్ద ఎత్తున కేరళ విహారయాత్రకు వెళ్తుంటారు. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. విజయవాడ నుంచి కొచ్చికి రైలులో ప్రయాణించాలంటే 18 నుంచి 20 గంటల సమయం పడుతుంది. విమాన సర్వీసు అందుబాటులోకి వస్తే కేవలం మూడు గంట్లోనే కొచ్చి వెళ్లవచ్చు.













