చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి : సోమిరెడ్డి
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటమి భయంతోనే కేసీఆర్ టీడీపీపై విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రధాని మోదీ నుంచి కేసీఆర్‌కు వరకు అందరికీ చంద్రబాబు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబును ఎంత తిడితే అన్ని ఓట్లు వస్తాయనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని, తెలుగు ప్రజలంతా దీనిని నిశితంగా గమనిస్తున్నారని అన్నారు చంద్రబాబు వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ మరిచారా? అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన కేసీఆర్ నడిపిన మంత్రివర్గంలో సగంమంది టీడీపీ గూటికి చెందిన వాల్లేనన్న సత్యాన్ని ఆయన గ్రహించాలన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందనే వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని పేర్కొన్నారు.













