సముద్రుడు ట్రైలర్ విడుదల
రమాకాంత్, భానుశ్రీ, అవంతిక నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం సముద్రుడు. నగేష్ నారదాసి దర్శకుడు. బదావత్ కిషన్, శ్రీరామోజ జ్ఞానేశ్వర్, సోమలు నిర్మించారు. హైదరాబాద్‌లో దర్శకుడు వి.సముద్ర చిత్ర టైలర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రమాకాంత్ నా సినిమాలన్నింటిలో నటించాడు. వాస్తవికతకు దగ్గరగా సరికొత్తగా సాగుతూ ట్రైలర్ ఆసక్తిని పంచుతున్నది అని అన్నారు. జాలర్ల జీవనశైలి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. తెలుగు తెరపై ఇప్పటివరకు ఎవరూ స్ప•శించని సరికొత్త కథాంశంతో తీశాం అని రమాకాంత్ తెలిపారు. భానుశ్రీ మాట్లాడుతూ నరసింహ లో రమ్యకృష్ణ పొలిన పాత్రలో నటించాను అని చెప్పింది. హైదరాబాద్, చీరాలలో చిత్రీకరణ జరిపామని, మే నెలాఖరున సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు అన్నారు.













