రాజకీయాలోకి సమంత?
ఇప్పుడున్న హీరోయిన్లందరితో సమంత చాలా తెలివైనదన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లయ్యాక కూడా హీరోయిన్గా తన స్థానానికి ఢోకా లేకుండా చూసుకోవడంలోనే సమంతా తెలివితేటలు మనకు అర్థమవుతాయి. హీరోయిన్గా బిజీగా ఉన్న సమంత, తెలంగాణలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం తెలిసిందే. అలాగే ప్రత్యూష పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి, పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న అక్కినేనివారి కోడలు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నేరుగా పోటీ చేయడం కానీ, లేక ఆ పార్టీ తరపున ఏదైనా నామినేటెడ్ పదవి పొంది, ఎన్నికల ప్రచారం నిర్వహించడం కానీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.













