ప్రతి రోజు పండగే
ప్రతి రోజు పండగే అని అంటున్నాడు హీరో సాయితేజ్. ఇటీవల చిత్రలహరి సినిమాతో విజయం అందుకున్న సాయితేజ్ కొత్త చిత్రం ప్రతిరోజు పండగే. దీనికి మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ దైవసన్నిధానంలో జరిగింది. జిఏ2, యువి పిక్చర్స్ సంయుక్త బ్యానెర్లో ఈ చిత్రం రూపొందనుంది. జిఏఏ, యువీ పిక్చర్స్ కలిసి ఓ సంస్థగా ఏర్పడి క్రేజీ కాంబినేషన్స్‌తో సినిమాలు తీస్తున్నాయి. వీరికి అల్లు అరవింద్ నిర్మాణ పర్యవేక్షణ తోడైంది. బన్నీవాస్, వంశీ, ప్రమోద్, విక్లీకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయితేజ్‌కు జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. ఇంకా ప్రధాన పాత్రలో స్తయరాజ్, రావు రమేష్ నటిస్తున్నారు. ఇంకా మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, భరత్‌రెడ్డి, హరితేజ నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, ఛాయాగ్రహణం: జైకుమార్ సంపత్.













