ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, బరోడాలలో పెడల్ టు ది మెటల్ – రెడ్ బుల్ ఫైట్ 2018
- భారతదేశవ్యాప్తంగా అమెచ్యూర్ గో కార్ట్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ ప్రారంభం
- అబూదాబి గ్రాండ్ పిక్స్ జరిగే యాస్ మారినా సర్క్యూట్ కు వెళ్ళనున్న నేషనల్ చాంపియన్
తిరుగులేని రేసింగ్ అనుభూతి, అమెచ్యూర్ గో కార్ట్ టోర్నమెంట్ కలగలసిన రెడ్ బుల్ కార్ట్ ఫైట్ తన రెండో ఎడిషన్ తో మళ్ళీ వచ్చింది. భారతదేశంలో అత్యంత వేగవంతమైన అమెచ్యూర్ కార్ట్ రేసర్ ను కనుగొనేందుకు డిజైన్ చేయబడిన ఈ టోర్నమెంట్ 2018 జూలై 1న బాగా ప్రజాదరణ పొందిన క్రీడా, వినోద కేంద్రమైన స్మాష్ లో ప్రారంభం కానుంది.
అమెచ్యూర్ రేసర్లు, రేసింగ్ ఔత్సాహికులకు కార్టింగ్ మరో వైపును చేరుకునే అవకాశాన్ని అందించడం, పోటీతత్వంతో కూడిన వినోదాన్ని అందించడం ఈ రెడ్ బుల్ కార్ట్ ఫైట్ లక్ష్యం. ప్రపంచపు అత్యుత్తమ ఎఫ్ 1 డ్రైవర్లు యాస్ మారినా సర్క్యూట్ లో పోటీపడేందుకు తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవ డాన్ని చూసే అవకాశాన్ని కూడా ఇది అందిస్తుంది. రెడ్ బుల్ కార్ట్ ఫైట్ నేషనల్ చాంపియన్ 2018 ఈ ఏడాది ఎఫ్1 చాంపియన్ షిప్ గ్రాండ్ ఫైనల్ అబుదాబి గ్రాండ్ ప్రి 2018 చూసేందుకు అన్ని ఖర్చులను సంస్థనే భరించే పర్యటన అవకాశాన్ని గెలుపొందగలరు.
రెడ్ బుల్ కార్ట్ ఫైట్ 2017 విజేత, ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడైన మోనిష్ జైన్ కు రేసింగ్ అంటే ఎంతో అభిమానం. కొన్నేళ్ళ క్రితమే ఆయన తన మక్కువను ఇంట్లో అరలో దాచేశారు. రెడ్ బుల్ కార్ట్ ఫైట్ 2017 లో పాల్గొనడం మోటార్ స్పోర్ట్ పట్ల ఆయన మక్కువ మరోసారి ప్రజ్వరిల్లే లా జేసింది. నాటి ఫైనల్స్ కు ముందు, గత ఏడాది ముంబై ఫైనలిస్టులంతా కూడా ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొన్నారు. వారంలో ఒకసారి వారంతా ముంబై లోని స్మాష్ లో రేస్ లో పాల్గొనే వారు.
ఆ అనుభవాన్ని గురించి అబుదాబి గ్రాండ్ ప్రి పర్యటనను గెలుపొందిన రెడ్ బుల్ కార్ట్ ఫైట్ 2017 భా రతీయ విజేత మోనిష్ జైన్ మాట్లాడుతూ, ‘‘గత ఏడాది రెడ్ బుల్ కార్ట్ ఫైట్ లో నా విజయం ద్వారా నేను పొందిన అవకాశానికి నేనెంతగానో కృతజ్ఞుడిని. నా అనుభవం గురించి ఆలోచించినప్పుడల్లా, జీవి తాంతం నిలిచిఉండే నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. గత దశాబ్ది కాలంలో, నేనెన్నడూ రేసింగ్ వైపు వె ళ్ళలేదు. రెడ్ బుల్ కార్ట్ ఫైట్ వచ్చిన తరువాత మాత్రం…ఓ పదేళ్ళ నిద్రావస్థ తరువాత… నా బుర్రలో రే సింగ్ పురుగు తొలవడం మొదలైంది. రెడ్ బుల్ కార్ట్ ఫైట్ నా రేసింగ్ కలలకు తిరిగి ప్రాణం పోసుకు నేందుకు ఒక అవకాశాన్ని అందివ్వడం మాత్రమే కాదు, మోటార్ స్పోర్ట్స్ లో ఆరితేరిన అత్యుత్తమ మెకానిక్ లను, పిట్ స్టాఫ్ ను కలుసుకునే అవకాశాన్ని కూడా అందించింది. రెడ్ బుల్ కు నా ధన్య వాదాలు. గత ఏడాది నవంబర్ మూడో వారాంతంలో 2017 ఫార్మూలా 1 సీజన్ ఫైనల్, అబుదాబి గ్రాం డ్ ప్రి ని యాస్ మారినా సర్క్యూట్ లో చూసే అవకాశాన్ని నేను పొందగలిగాను. అది నా రెండో లైవ్ ఎఫ్ 1 అనుభూతి. మొదటిది బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి. పిట్ లేన్ వాక్ అనుభవం మరచిపోలేనిది. మెయిన్ గ్రాండ్ స్టాండ్ వెనుక డెమో పిట్ స్టాప్ పై చేతులు వే సేందుకు ప్రయత్నించాను. ఊహకు అందని అనుభూతి అది. రెండోఎడిషన్ లో పాల్గొంటున్న వారం ద రికీ నా అభినందనలు. గెలుపొందేందుకు మీరంతా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
యూరో జేకే సిరీస్ లో పోటీపడుతున్న భారతదేశ మొట్టమొదటి మహిళా డ్రైవర్, రెడ్ బుల్ అథ్లెట్ మీ రా ఎర్డా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘రెడ్ బుల్ తో నా అనుబంధం ఎంతో గొప్పది. రేసర్లు అంతా అభిమానించేది దాన్నే. దాని గురించి అంతా ఎంతో క్రేజీగా ఉంటారు. రెడ్ బుల్ కార్ట్ ఫైట్ ను ప్రవేశపెట్ట డం ఎంతో ఆనందదాయకం. రేసులో పాల్గొనేందుకు, పోటీ అనుభూతితో పాటు వినోదం పొందేందుకు అమెచ్యూర్ డ్రైవర్లకు ఇదో గొప్ప అవకాశం. రెండో ఎడిషన్ కోసం వేచి చూస్తున్నాను. ఇందులో పాల్గొనే వారు దీన్నొక గొప్ప సవాలుగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో రేసింగ్ అందించే థ్రిల్ ను అనుభూతి చెందాల్సిందిగా ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు.
రెడ్ బుల్ కార్ట్ ఫైట్ 2018 జూలై 2018లో క్వాలిఫయర్స్ తో ప్రారంభమై 2018 సెప్టెంబర్ వరకు కొన సాగనుంది. ముంబై, ఢిల్లీలలో ముగియనుంది. బెంగళూరు (మెకో కాట్రోపియా), హైదరాబాద్, చెన్నై, బరోడా (ఎర్దాస్ స్పీడ్ వే) లలో 16 ప్లస్ వయో విభాగంలో వన్ డే క్వాలిఫయర్స్ అక్టోబర్ లో జరిగే నేష నల్ ఫైనల్స్ లో పాల్గొంటారు.
రెడ్ బుల్ కార్ట్ ఫైట్ 2018
సిటీ క్వాలిఫయర్స్
సమయం : జూలై నుంచి సెప్టెంబర్ 2018 (ప్రతి రోజు)
స్థలం : స్మాష్, లోయర్ పారెల్, ముంబై
స్మాష్ స్కై కార్టింగ్, సెక్టర్ 29, గురుగావ్
వన్ డే క్వాలిఫయర్స్
సమయం : ఆగస్టు – సెప్టెంబర్ 2018 (1 Day Qualifier)
స్థలం : బెంగళూరు (మెకో కార్టోపియా), హైదరాబాద్, చెన్నై
బరోడా (ఎర్దాస్ స్పీడ్ వే)
సిటీ ఫైనల్స్
తేది : 2018 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారం
స్థలం : స్మాష్, లోయర్ పారెల్, ముంబై
స్మాష్ స్కై కార్టింగ్, సెక్టర్ 29, గురుగావ్
సిటీ క్వాలిఫయర్స్ లో వేగవంతమైన ల్యాప్ టైమింగ్స్ ఆధారంగా, సిటీ ఫైనల్స్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లలో జరుగుతాయి. ప్రతీ నగరానికి సంబంధించి, గత నెల టాప్ -20 రేసర్లు స్మాష్ ముంబై, గురుగావ్ లలో ఆ నెలలో టాప్ 3 స్లాట్స్ కోసం పోటీ పడుతారు. రేసింగ్ పట్ల వారి మక్కువను వేడుక చేసుకునేలా స్మాష్ లో రోజువారీ విజేతలకు ఎక్స్ క్లూజివ్ రెడ్ బుల్ కార్ట్ ఫైట్ మర్కండైజ్ అందిస్తారు. ముంబై, గురుగావ్ ల నుంచి మూడు నెలల పాటు టాప్ -3 లో వచ్చిన వారు మరియు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, బరోడాలలో క్వా లిఫయర్స్ నుంచి 1 విజేత చొప్పున మొత్తం 22 మంది రేసర్లు నేషనల్ ఫైనల్స్ లో పోటీ పడుతారు.
అక్టోబర్ లో జరిగే ఫైనల్స్ లో విజేత, నవంబర్ 25న అబుదాబి గ్రాండ్ ప్రి 2018 కి పయనమవుతారు.
రిజిస్ట్రేషన్
- పాల్గొనదల్చిన వారు వెన్యూ వద్ద సిస్టమ్ లో రిజిష్టర్ చేయించుకోవాలి. అది వారి పేరు కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడి, వెబ్ కామ్ ఫోటోను కాప్చర్ చేస్తుంది
- పాల్గొనే వారు తమ సోషల్ మీడియా పేజ్ ఉపయోగించడం ద్వారా కూడా రిజిష్టర్ చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ నేరుగా కార్ట్ టైమింగ్ సిస్టమ్ కు లింక్ అవుతుంది
టైమింగ్ సిస్టమ్
- పార్టిసిపెంట్ పేరు, 1/100th టైమింగ్ అక్యురేట్ తో ప్రదర్శించబడుతుంది.
- ప్రతి రేసుకు ముందు, లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ తో అప్ డేట్ చేయబడుతుంది (ఆ రోజు & ఆ నెల టాప్ ర్యాంకింగ్)
Keep following us for updates on www.redbull.in/kartfight, Facebook – http://www.facebook.com/redbull and Twitter – http://www.twitter.com/redbullindia
To download images and videos, visit: www.redbullcontentpool.com
For further media information, please contact:
|
Madison Public Relations Myrtle Dsilva Cell: +91 9819135564 Email: myrtle.dsilva@madisonpr.in |
Madison Public Relations Tanya Menon Email: tanya.menon@madisonpr.in |













