ఆర్ బీఐ సంచలన నిర్ణయం
భారత రిజర్వు బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో రీ డిజైన్ చేసిన కొత్త వందరూపాయల నోటును ప్రవేశపెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చికల్లా కొత్త రెండు వందల రూపాయల నోట్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టడం పూర్తి చేసి కొత్తగా వంద రూపాయల నోట్లను ముద్రించాలని ఆర్బీఐ భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పాత వంద రూపాయల నోట్లను క్రమేణా ఉపసంహరించుకొని వాటి స్థానంలో కొత్తగా డిజైన్ చేసిన నోట్లను ప్రవేశపెట్టనుంది. అయితే కొత్త వందరూపాయల నోటు సైజులో ఎలాంటి మార్పు చేయకుండానే పాత నోటు సైజులోనే ముద్రించాలని ఆర్బిఐ అధికారులు నిర్ణయించారని సెంట్రల్ బ్యాంకు అధికారులు వెల్లడించారు. కొత్త వందరూపాయల నోట్ల ముద్రణ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి చేపట్టాలని ఆర్బీఐ అధికారులు నిర్ణయించారు.













