టాలీవుడ్‌కు రామ్‌గోపాల్ వర్మ గుడ్‌బై
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను విమర్శించే వారికి శుభవార్త. రామ్‌గోపాల్ వర్మ టాలీవుడ్‌కు టాటా చెప్పేశానని ప్రకటించారు. తెలుగులో ఇకపై సినిమాలు చేయనని అన్నారు. హిందీలోనే సినిమాలు తీస్తానని చెప్పారు. అయితే తన గోల్ రోజూ మారిపోతుంటుందని, రోజుకొక లక్ష్యంగా ఉంటుందని అన్నారు. బాహుబలి వంటి డ్రీమ్ సినిమా తీయడం తనకు చేతకాని పని అని సృష్టం చేశారు. రక్తచరిత్ర 3 సినిమా తీసే ఉద్దేశ్యం లేదని వర్మ చెప్పారు. మద్దెలచెర్వు సూరి హత్య తరువాత వల్లభనేని వంశీ ఫోన్ చేశాడని, తామిద్దరం ఆ హత్య గురించే మాట్లాడుకున్నామని, అతను నిర్మాతగా రక్తచరిత్ర 3 సినిమా తీయవలసిందని మాత్రం అడగలేదని వర్మ సృష్టం చేశారు. సర్కార్ 3 పరాజయం అయినంత మాత్రన తాను విఫలమైనట్టు కాదని అన్నారు. ప్రతి సినిమాకు తాను ఓకేలా ఎఫర్ట్ పెడతానని, అయితే అందులో కొన్ని సక్సెస్ అయితే, మరికొన్ని ఫెయిల్యూర్ అవుతాయని తెలిపారు.













