బుర్కా వేసుకుని కోర్టుకు వచ్చిన రాఖీ సావంత్
మహార్షి వాల్మీకిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ లూథియానా కోర్టు ముందుకు హాజరైంది. అయితే తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆమె బుర్కా వేసుకుని కోర్టుకు వచ్చింది. ఒకరోజు ముందే బాలీవుడ్ స్టార్ కోర్టు ముందు సరండర్ అయ్యింది. కోర్టు విచారణకు ఒక రోజు ముందే ఆమె లొంగిపోయినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి వాల్మీకిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాఖీ సావంత్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొంటున్నది. అయితే జూలై 7వ తేదీన ఆమెను ఎలాగైన కోర్టు ముందు హాజరుపరచాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఓసారి పంజాబ్ పోలీసులు ముంబైలో ఉన్న ఆమె ఆపార్ట్‌మెంట్‌కు వెళ్లి వచ్చారు. రెండు లక్ష రూపాయల బాండ్లను సమర్పించిన రాఖీ సావంత్‌కు కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఆ తర్వాత ఆమె ముంబైకి వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. గతంలో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ మహార్షి వాల్మీకిపై రాఖీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ కేసులో ఆమె వాల్మీకి వర్గానికి క్షమాపణలు చెప్పింది. దీంతో ఆమెకు బెయిల్ దొరికింది.













