సిరిసిల్లకు అరుదైన ఘనత
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా అరుదైన ఘనతను సాధించింది. పరిశుభ్రత, బహిరంగ మల విసర్జన రహిత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పరంగా ఈ జిల్లా స్వచ్ఛభారత్ ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానాన్ని దక్కించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, నదియా, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేరి, మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్ జిల్లాలు కూడా మొదటి ర్యాంకు దక్కించుకున్న వాటిలో ఉన్నాయి. ఈ జాబితాను కేంద్రం ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం జరిగినట్లు కేంద్రం కొద్దిరోజుల కిందట నిర్వహించిన సర్వేలో తేలింది. స్వచ్ఛమైన తాగు నీరు, ఇంటింటా చెత్త సేకరణలో వంద శాతం మార్కులను ఈ జిల్లా దక్కించుకుంది.













