ఈ నెల 26న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీపావళి పండుగ నాటికి ఏఐసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టనున్న రాహుల్ గాంధీ, ఈ నెల 26న అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నగరంలోని నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమని, రాష్ట్ర అభివృద్ధి కూడా ఒక్క కాంగ్రెస్ వల్లనే సాధ్యమన్న ఈ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజాంకాలేజీ మైదానంలో నిర్వహించే భారీబహిరంగసభలో పాల్గొనాల్సిందిగా రాహుల్ ను ఆహ్వానించినట్లు, దానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలంగాణ పీసీసీ నేతలు తెలిపారు.













