రాహుల్ కి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీ ఇవాళ 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ సుదీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తన ట్వీట్లో వెల్లడించారు. రాహుల్ గాంధీ 2017 డిసెంబరు 11న ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుమందు 2013 జనవరిలో ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇదే మొదటి పుట్టిన రోజు. రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీ పార్టీ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.













