తెలుగు భాషాభిమానులకు విన్నపం
మీ అందరి ఆదరాభిమానాలతో నేడు పాఠశాల విజయవంతంగా వివిధ కేంద్రాల్లో తరగతులను నిర్వహిస్తోంది. నేటి వర్తమానానికి అనుగుణంగా పాఠశాల విద్యాబోధనలో మార్పులను తీసుకువచ్చి, విద్యార్థులకు మరింత సులభంగా తెలుగును నేర్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖతో కలిసి తెలుగు భాషను నేర్పించే 4 సంవత్సరాల తెలుగు పలుకు కోర్స్‌ను పాఠశాల నేడు బోధిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై చిన్నారుల కోసం సులభంగా, సరళంగా ఉండేలా తెలుగుపలుకు కోర్స్‌ను రూపొందించింది. శాస్త్రీయమైన పద్ధతులతో, చిన్నారులకు ఇష్టమయ్యేలా ఆ కోర్స్‌ను నేర్పుతోంది.
లెర్నింగ్ – స్పీకింగ్-రీడింగ్-రైటింగ్ (ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు) పద్ధతిలో పాఠశాల చిన్నారులకు తెలుగు భాషను నేర్పుతోంది. తొలి సంవత్సరం తెలుగుపలుకు కోర్స్ బోధన 50శాతం రాత, 50 శాతం బోధన ఉంటుంది.
పాఠశాల హైదరాబాద్ ఆఫీస్ సెప్టెంబర్ 2017 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాలను ముద్రించింది.
కాలిఫోర్నియాలోని ఐటీ కంపెనీ ఫోర్సిస్ ఇంక్ (Forsys Inc,)తో కలిసి ఆన్లైన్లో తెలుగు పలుకు కోర్స్‌ను బోధిస్తోంది. ఇ లెర్నింగ్ ద్వారా టెస్ట్‌లు, అసైన్మెంట్స్ వంటివి నిర్వహించడంతోపాటు పరీక్షలను కూడా ఆన్లైన్లో పెట్డడం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన తెలుగుఅడుగుఫైనల్ పరీక్షలను కూడా ఆన్లైన్లో నిర్వహించినప్పుడు దాదాపు 100 మంది స్టూడెంట్లు పాల్గొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తీర్ణత సర్టిఫికెట్లనుఅందుకున్నారు.
కొత్త కేంద్రాల ఏర్పాటు ద్వారా మరింతమందికి పాఠశాల విద్యాబోధనను అందజేయడం జరుగుతోంది.
ఆన్లైన్ సపోర్ట్‌తో, తెలుగు పలుకు కోర్స్‌ను విద్యార్థులకు నేర్పేందుకు కేవలం 275 డాలర్లను మాత్రమే ఫీజుగా నిర్ణయించింది. 31జూలైలోగా ఎవరైనా ఫీజు చెల్లించి అడ్మిషన్లు పొందినవారికి 25డాలర్లను డిస్కౌంట్‌గా ఇవ్వడం జరుగుతుంది.
పాఠశాల అందిస్తున్న 30రోజుల ఉచిత శిక్షణను చూడంది. పాఠశాల బోధన, సిలబస్, పరీక్షల నిర్వహణ వంటివి తెలుసుకోండి.
ఈ సంవత్సరం నుంచి మీరు మీ చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకు ఆసక్తి ఉన్న వారు తమ చిన్నారులను పాఠశాలలో చేర్పించండి. అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా పాఠశాల విద్యాబోధనను తెలియజేసి వారి చిన్నారులను కూడా ఇందులో చేర్పించేలా ప్రోత్సహించండి. త్వరగా చేరేవారికి లభించే 25 డాలర్ల డిస్కౌంట్‌ను అందుకోండి.
శుభాకాంక్షలతో…
పాఠశాల యాజమాన్యం
info@paatasala.net
www.paatasala.net













