నాజర్ కేసీఆర్ గా ‘ఉద్యమ సింహం’
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోలో గురువారం (జూన్ 28) కేసీఆర్ బయోపిక్ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. సినిమాకు ‘ ఉద్యమ సింహం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాను కేసీఆర్ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్ 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.













