నాటా సాహిత్య సమావేశాలు
ఫిలడెల్పియాలో నాటా నిర్వహిస్తున్న మహాసభల్లో జరిగే సాహిత్య సమావేశాల కోసం పలువురు రచయితలు, కవులు కూడా వేడుకలకు వస్తున్నారు. అష్టావధాని నరాల రామారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి సుబ్బారావు దుగ్గిరాల, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాప కుడు, రచయిత వంగూరి చిట్టెన్ రాజు, హిందీ తెలుగు రచయిత జెఎల్ రెడ్డి, రచయిత నారాయణ రెడ్డి, సినీ రచయిత వడ్డేపల్లి కృష్ణ, రచయిత, జర్నలిస్ట్ ఇన్నయ్య నరిసెట్టి, నారాయణ స్వామి వెంకట యోగి, శివకుమార్ శర్మ, రవి వీరెల్లి, అఫ్సర్, కల్పనా రెంటాల, నాగపద్మిని పుట్టపర్తి, సిఆర్ విశ్వేశ్వరరావు తదితరులు కూడా ఈ కాన్ఫరెన్స్‌కు వస్తున్నారు.













