వెటరన్ డైరెక్టర్, లెజెండరీ యాక్ట్రస్ విజయ నిర్మలగా కనిపించనున్న కీర్తి సురేష్?
అలనాటి అందాల తార మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో ఎంతో కీర్తి తెచ్చుకున్న కీర్తి సురేష్. ఆ తరువాత రెగ్యులర్ గ్లామర్ పాత్రలలో మూవీస్ చేస్తుంది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన ఆమె అందరినీ మంత్ర ముగ్దులని చేసి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన ఆమె యావత్ ప్రపంచ తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దులని చేసింది.తన నటనతో కీర్తిశేషురాలైన సావిత్రిని మన కళ్ల ముందు సాక్షాత్కరింప జేసిందనే చెప్పాలి. ఆ విధంగా ఆమె నటనకి మంచి ప్రశంసలు అందుకుంది. జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కి బయోపిక్ ప్రాజెక్ట్ ఆఫర్స్ ఎక్కువగా వస్తుండటం విశేషం.
ఇక ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య.. దివంగత విజయ నిర్మల బయోపిక్ ను రూపొందనున్న నేపథ్యంలో కీర్తి సురేష్‌ని టైటిల్ రోల్ కోసం ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది . విజయ నిర్మల కుమారుడు నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఇప్పటికే సినిమాలో ప్రధాన పాత్ర కోసం కీర్తి సురేష్‌ని సంప్రదించారని తెలుస్తోంది. కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కాగా నటిగా, దర్శకురాలిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందిన విజయ నిర్మల బయోపిక్‌లో కీర్తి నటిస్తే ఆమె కెరీర్‌కి మరో గొప్ప సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ నిర్మల బాల నటి, హీరోయిన్ గా దర్శకురాలిగా, నిర్మాతగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి గా ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం లో నటించడానికి ఎన్నో పాత్రలు లకు అవకాశాలున్నాయి మంచి కమర్షియల్ సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. పైగా ఆమెకు తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళం లో కూడా మంచి గుర్తింపు ఉండడంతో మూడు భాషల్లో ఈ మూవీ విడుదల చెయ్యొచ్చు. అదేవిధంగా ఆ మధ్య ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవిత నేపథ్యంలో సింగీతం శ్రీనివాసరావు ఓ బయోపిక్ తెరకెక్కించనున్నారని టాక్ వినిపించింది. ఇందులో కీర్తిని ప్రధాన పాత్ర కోసం తీసుకుంటారనే ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతుంది.













