నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఇప్పుడు ఇద్దరూ ఒక్క తాటిపై నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకరినొకరు పొగుడుకుంటూ ఎవరి దారిలో వారు సాగిపోతున్నారు. ఇటీవల వర్మ ట్వీట్ చేసిన పోస్టుకు మహేష్ రిప్లై ఇచ్చారు. అది కూడా అసూయగా ఉందంటూ, అసలు విషయం ఏంటంటే. ఇటీవల వర్మ మనం తీసుకునే ఏదైనా నిర్ణయం కాస్త లేట్ అయిందంటే మన సమయంలో కొంత వేస్ట్ అయినట్టే. టైమ్ వేస్ట్ అయిందంటే దాని అర్థం మన లైఫ్ వేస్ట్ అయినట్టే. అంటూ టైమ్ వేస్ట్‌గా గురించి ట్వీట్ చేశారు. దీనికి కత్తి మహేష్ నువ్వు లైఫ్ వేస్ట్ చేసుకోవడాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆ విషయంలో నిన్ను చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేశాడు.













