ఆప్‌తో కలవడం లేదు… కొత్త పార్టీ పెడతా
విశ్వ నటుడు కమల్‌హాసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం లోపు పార్టీ పెడుతానని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. సమయానికి పార్టీ పెట్టాలన్న నిబంధనలు ఏమీ లేవని, ప్రజల అభిప్రాయం తెలుసుకుని పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కమల్‌ను కలిశారు. దీనిపై కమల్ స్పందించారు. తాను క్రేజీవాల్‌ను కలవలేదని, ఆయన తనకు వద్దకు వచ్చారని చెప్పారు. అది ఆయన మంచితనం. తాను ఆప్‌తో చేతులు కలపడం లేదని ఆయన సృష్టం చేశారు.













