విదేశాలకు ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ వంద కోట్ల క్లబ్‌లోకి చేరతారని వాళ్ల ఆశ. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే నెల నుండి రాజమౌళి మల్టీస్టారర్‌లో నటిస్తాడు ఎన్టీఆర్. కాబటి నెల రోజులు ఫ్యామిలీతో కలిసి హాలీడేకి వెళ్లనున్నాడట. ఏకధాటిగా షూటింగ్లో పాల్గొనడం, మరోవైపు మానసికంగా కృంగుబాటులో వున్న ఆయనకు ఇపుడు మానసిక ప్రశాంతత అవసరం కాబట్టి, నెలపాటు ఎవ్వరికీ చెప్పకుండా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెకేస్తాడట. ఎక్కడికి అన్నది సస్పెన్స్. దాదాపు నెల తరువాత ఇండియాకి వచ్చి ఫ్రెష్‌గా రాజమౌళి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది.













