ఆలోచించండి..ఓట్ వెయ్యండి – Jalagam Sudheer
మనం ఎంత గొప్పగా నీతులు మాట్లాడుకున్న పార్టిలకతీతంగా క్షేత్రస్థాయిలో జరిగే అనేక విషయాలు మనందరికి తెలిసిందే. ఒక సామాన్యుడు ఎం.ఎల్.ఏ స్థాయికి పోటి చేయాలంటే ఎంత కష్టమో, ఎన్ని రకాల అవంతరాలు ఎదుర్కొవాలో, గంట గంట కు బండ బూతులతో మాటలు మార్చే నేతలతో ఎలా ఉండాలో అందరికి తెలిసిన సర్వ సాధారణమైన విషయం.
వ్యక్తిగతంగా కె.సి.ఆర్ నాయకత్వం లో తెలంగాణ అభివ్రుద్ది చెందుతుందని నమ్ముతు, టి.ఆర్.ఎస్ పార్టి ని సమర్దిస్తు ఇంకొంతమంది మిత్రులతో కలిసి కోదాడ, హుజుర్ నగర్,వనపర్తి, కొల్లాపూర్, సత్తుపల్లి, వేములవాడ భద్రాచలం, అచ్చంపేట్, దేవరకొండ, కొత్తగూడెం లాంటి ప్రదేశాల్లొ ప్రచారం చేసినం. బీర్, బిర్యానిలకు దూరంగా యువత కు అవగాహన కల్పిస్తు, విద్యావంతుల ఆలోచనలను అర్ధం చేసుకుంటు, అన్ని వర్గాలకు చేరువయ్యే ప్రయత్నం చేసిన.
పార్టిలకతీతంగా మనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే హక్కు మనకు ఉంది. నాకు సహకరించిన మిత్రులందరికి క్రుతజ్ఞతలు తెలియచేస్తు, మీ మీ స్థానిక పరిస్తుతులను పరిగణలోకి తీసుకొని మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని ప్రజాస్వామ్యం లో ఒక సామాన్యుడు కూడ అసెంబ్లి కి ఎన్నికయ్యే రోజులొస్తాయని ఆశిద్దాం.
ప్రజల అభిప్రాయాన్ని, ప్రజా సమస్యలను నిర్మోహమాటంగా మనందరికి చేరవేసిన పాత్రికేయ మిత్రులకు క్రుతజ్ఞతలు.













