ఇవాంక కోసం హైదరాబాద్ ముస్తాబు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక సందర్భంగా హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సమ్మిట్‌లో పాల్గొనేందుకు వస్తున్న ఇవాంక, ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రపంచ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలికేందుకు బల్ధియా అధికారులు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. కంటిమీద కునుకు లేకండా రోడ్లపై అధికారులు తిరుగుతున్నారు. పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవ్వరిని కదిలించినా ఇవాంక పేరే వినిపిస్తోంది. ఇవాంక రాక సందర్భంగా సిటీ మొత్తం అలర్ట్ అయ్యింది. పోలీసులు నుంచి జీహెచ్ఎంసీ, పర్యాటక, హెచ్ఎండిఎ, ఐటీ, పరిశ్రమల అధికారుల వరకు అందరు అటెన్షన్ అయ్యారు. ఈ నెల ఇవాంక వస్తోందని తెలిసి రూ.100 కోట్లు పెట్టి మరీ హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ ముస్తాబు చేస్తోంది. వీవీఐపీలు తిరేగే జోన్లలో కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, పుట్‌పాత్‌లు, గార్డనింగ్ పనులు ఇలా అనేక అభవృద్ధి పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీతో పాటు సదస్సులో జరిగే హైటెక్‌సిటీలో ఇరవై నాలుగు గంటల పాటు పనులు జరుగుతున్నాయి.













