కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబర్ లీడర్ సమ్మిత్కు తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందించింది. ఆగస్టు 29, 30 తేదీలలో జరిగే ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం లభించింది. ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ నిర్వహించే ఈ సమావేశంలో ఆస్ట్రేలియాలోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగ కార్యకలాపాలకు సంబంధించిన చర్చ జరుగుతుందని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఐటీ రంగంలో వినూత్నమైన కార్యక్రమాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, తక్కువ సమయంలో రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రికి పంపిన ఈమెయిల్ పేర్కొన్నారు తెలంగాణ అనుభవాలను ఈ వేదికపై పంచుకోవాల్సిందిగా కోరారు. ఎఐఐఎ నుంచి వచ్చిన ఈ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు లభించిన ప్రపంచస్థాయి గుర్తింపుగా భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఆహ్వానం రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.













