అమెరికాలో భారత సంతతి తల్లీకొడుకుల హత్య
వర్జీనియా శివారులోని అంగతకులు జరిపిన కాల్పుల్లో ఒక ప్రవాస భారతీయ మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటోలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారు మాలా మన్యాని, రిషి మన్వానిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వారం రిషి ఉద్యోగానికి రాకపోవడంతో సహోద్యోగి కాల్ చేశారు. వారు స్పందించకపోవడంతో పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ ఇంట్లో తల్లి, కుమారుడు మాత్రమే నివసిస్తున్నారని, ఇంటిని తనఖీ చేశామని, వారి శరీరానికి తుపాకి గాయలున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇది జాతి విద్రోహ చర్యకు సంబంధించిన హత్యగా తాము భావించటం లేదని పోలీసులు పేర్కొన్నారు.













