భారత వాయుసేనకు అమెరికా అపాచీ హెలికాప్టర్లు
భారత వాయుసేనకు అమెరికా తయారు చేసిన అపాచీ హెలికాప్టర్లను ఆ దేశ అధికారులు అందజేశారు. అమెరికాలోని అరిజోనా నగరంలో తయారు చేసిన 22 అపాచీ గార్డియన్ హెలికాప్టర్లను భారతదేశానికి అందించేందుకు 2015 సెప్టెంబరులోనే ఒప్పందం కుదిరింది. భారత వాయుసేన ఎయిర్ మార్షల్ ఎఎస్ భుటోలా అమెరికా అధికారుల నుంచి ఈ హెలికాప్టర్లను స్వీకరించారు. అపాచీ హెలికాప్టర్లను నడిపేందుకు వీలుగా భారత వాయుసేన అధికారులకు అమెరికా దేశం అలబామా నగరంలోని యూఎస్ ఆర్మీ బేస్ ఫోర్ట్ రక్కార్ లో యూఎస్ ఆర్మీ అధికారులు శిక్షణ ఇచ్చారు. ఎతైన కొండప్రాంతాలకు కూడా అపాచీ హెలికాప్టర్లలో ప్రయాణించవచ్చు. భవిష్యత్ వాయుసేన అవసరాల దృష్ట్యా అత్యంత అధునాతనమైన అపాచీ హెలికాప్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని వాయుసేన అధికారులు తెలిపారు.













