ఈ నెల 12 నుంచి పురావస్తుశాఖ అంతర్జాతీయ సదస్సు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 12, 13 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దక్షిణాసియా బృహత్ శిలాయుగపు సంస్కృతులపై ఇటీవల పరిశోధనలు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ పురావస్తు, సంగ్రహాలయాల శాఖ, దక్కన్ కళాశాల (పుణె) సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం దేశంలోని 30 విశ్వవిద్యాలయాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల నుంచి దాదాపు 70 మంది తమ పరిశోధన పత్రాలు సమర్పించారని పురావస్తు, సంగ్రహాలయాల విభాగం కమిషనర్ జి.వాణిమోహన్ తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో బృహత్ శిలాయుగపు సంస్కృతులకు సంబంధించి 50 చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద తవ్వకాల్లో ఒకటిగా దీన్ని పురావస్తుశాఖ చెబుతోంది.













