అమెరికాలో భారీ భూకంపం…
కరోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికాను భారీ భూకంపం వణించింది. అమెరికా రాష్ట్రం ఇదాహోలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన భూకంపం సంభవించిందని నేషనల్ వెదర్ సర్వీస్ ఒక ట్వీట్ లో పేర్కొంది. మంగళవారం సాయంత్రం 20-30 సెకన్ల పాటు భూమి కంపించిందని తెలిపింది. రాష్ట్ర రాజధాని బోయిస్కు ఈశాన్యంగా ఒక మారుమూల పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే నివేదించింది. దీంతో భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ట్విటర్ ద్వారా కొంత మంది తమ అనుభవాలను షేర్ చేశారు. దీనిపై మరిని వివరాలు అందాల్సి ఉంది.













