అంగరంగ వైభవంగా కోదండరామిరెడ్డి జన్మదిన వేడుకలు
ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన సీనియర్ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఆయన 70వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కోదండరామిరెడ్డి 1980లో సంధ్య అనే చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సీనియర్ దర్శకుడి జన్మదిన వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి.అశ్వనీదత్, ఎమ్మెస్ రాజు, దిల్ రాజు, అనిల్ సుంకర, దర్శకుడు బి.గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్.నారాయణ, చంటి అడ్డాల, ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీత దర్శకుడు కోటీ, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.













