పల్లెపాడులో డిజిటల్ తరగతి ఏర్పాటు
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్కోమటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలమేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఎన్నారైల సహకారంతో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లెపాడు మండల పరిషత్ పాఠశాలలో డిజిటల్ తరగతి గదిని ఎన్నారైలు నర్రా రవీంద్రా, క్రాంతిల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ తరగతి గది ప్రారంభ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు రావెల కిషోర్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేశారు. తరగతి గదికి విరాళాన్ని అందించిన దాతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.













