తారల ఇంట్లో దీపావళి సందడి!
ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే తారలు దీపావళి వేడుకలు కుటుంబసభ్యులతో సంబరంగా జరుపుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్‌కల్యాణ్ కుటుంబసభ్యులతో హాజరయ్యారు. అలాగే విశిష్ట కథానాయకుడు డాక్టర్ మోహన్‌బాబు ఇంట్లో జరిగిన వేడుకలకు చిరంజీవి, కృష్ణంరాజు, ప్రభాస్ సహా పలువురు తారలు, కే.రాఘవేంద్రరావు, సత్యానంద్ తదితర సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. అదే విధంగా నాగార్జున, అమల దంపతులు కుటుంబసమేతంగా దీపావళి టపాసులు కాల్చారు. పండగ రోజున సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిసిపోయారు. ఈ దీపావళి ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.













