50 ఏళ్ల వ్యక్తితో రకుల్ రొమాన్స్
ఒకప్పుడు యంగ్ హీరోలు అందరికీ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్న రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు రూటు మార్చేసింది. అందాల ఆరబోతకు, రొమాన్స్‌కు సై అంటోంది. బాలీవుడ్లో రకుల్ దేదే ప్యార్ దే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆజయ్ 50 ఏళ్ల వ్యక్తిగా నటిస్తే ఆయనతో రొమాన్స్ చేసే యంగ్ లవర్‌గా రకుల్ నటిస్తోంది. ఈ సినిమాపై ఈ బ్యూటీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉంది. ఈ చిత్రంలో రకుల్ పాత్రను హాట్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ఓ పార్టీ సాంగ్‌కు సంబంధించిన స్టిల్సలో రకుల్ హాట్ హాట్‌గా దర్శనమిస్తోంది. లైట్ పింక్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో ఈ బ్యూటీ అందాలొలికిస్తోంది. ఆమె పక్కనే అజయ్‌దేవగణ్ కూడా ఉన్నాడు.













