దర్శకుడు కె.విశ్వనాథ్‌కు పౌరసన్మానం
వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామస్థుడైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దర్శకుడు, నటుడు కె.విశ్వనాధ్‌కు గ్రామస్తులు ఘనంగా సత్కరించి పౌరసన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జున్ రావు, కేంద్ర సెన్సార్ బోర్డు నెంబర్ దిలీప్ రాజా తదితరులు హాజరయ్యారు.
భారతదేశం సినీ ప్రపంచంలో గర్వించ దగ్గ వ్యక్తి కె.విశ్వనాధ్ అని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సినిమారంగంలో ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు పొందిన మహోనోత్తమైన వ్యక్తి అని అన్నారు. తెలుగుజాతికి ఓవరం, తెలుగు సినీపరిశ్రమకు ఆణిముత్యం కె.విశ్వనాధ్ అని బుద్ధప్రసాద్ చెప్పారు. తెలుగు బాష, సంస్కృతి నలుమూలలా ఇనుమడింప చేసిన వ్యక్తి అని అన్నారు. పెదపులివర్రు గ్రామం తనకు జన్మనిచ్చిన ఊరు అని తాను ఎక్కడ ఉన్నా జన్మనిచ్చి ఊరు మధుర జ్ఞాపకాలను మర్చిపోలేనని దర్శకుడు కె విశ్వనాధ్ అన్నారు. తనకు చేసిన ఈ పౌరసన్మానం నాజీవితంలో మర్చిపోలేనిదని, మీ అందరు ఒకశాతం నాకు శ్వాస ఇస్తే శాతాహిస్కుడిని అవుతానని కే.విశ్వనాధ్ పేర్కొన్నారు.













