నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుతాం … అమెరికా కంపెనీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో అడుగుపెట్టగానే పెట్టుబడుల వేట ప్రారంభించారు. గూగుల్, ఫెక్స్ట్రానిక్స్, ఎంఆర్ఎం హోల్డింగ్స్, టెస్లా, మోసెర్, జోహో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సీఈవోలు, సీఎఫ్వోలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణం గురించి వివరించారు. అమరావతి నిర్మాణంలో భాగమయ్యేందుకు ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ ఆసక్తి వ్యక్తం చేసింది. మరోవైపు బిలియన్ డాలర్ల ఐటీ కంపెనీగా ఉన్న జోహో దక్షిణాంధ్రకు వస్తామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీధర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి హామీ పొందారు.













