సిగరేట్ అలవాటుకు చెక్
ధూమపాన అలవాటు మాన్పించేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీనికి కావాల్సిందల్లా చేతులకు సెన్సర్లతో కూడిన రిస్ట్‌బ్యాండ్స్, స్మార్ట్‌ఫోన్, అందులో ఒక అలర్ట్ యాప్. సిగరేట్ తాగుతున్నట్లు లేదా ఆ లక్షణాలను సెన్సర్లు గ్రహిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్లోని అలర్ట్యాప్కు హెచ్చరిక సందశం వస్తుంది. ఒక్కోసారి 2 నిమిషాల వీడియో యాప్‌లో ప్రత్యక్షం అవుతుంది. దీనిని చూసిన వెంటనె సిగరేట్ తాగడం ఆపేస్తారని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ వివరాలను స్మార్ట్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురించారు. దురలవాట్ల నుంచి బయటపడాలనుకునే వారు ఈ మధ్య శరీరానికి ధరించే గాడ్జెట్‌ను ఆశ్రయిస్తున్నారు.













