ప్రజా సహకారంతోనే ఇది సాధ్యం : చంద్రబాబు
నాలుగేళ్ళలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామని, సమిష్టికృషి, ప్రజా సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహా సంకల్పం నిర్వహణపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మన శక్తి, స్థాయి మహాసంకల్పంలో ప్రతిబింబించాలని అన్నారు. ప్రతినెలా ఇదేరోజు మహా సంకల్పం పురగతిని సమీక్షించాలన్నారు. అలాగే మహా సంకల్పంపై నెలవారీ ప్రగతిని విశ్లేషించాలని అన్నారు. నేడు ప్రతిగ్రామం పోటీబడి అభివృద్ధి చెందుతున్నాయని, ప్రతి ఊళ్లో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు, ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటవుతున్నాయని, అంతేగాక ప్రతి ఊళ్లో పచ్చదనం పెరిగి ఆహ్లాద వాతావరణం నెలకొందని అన్నారు.













