ఇది అప్రజాస్వామికం : చంద్రబాబు
మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికలైన వెనువెంటనే కార్యకర్తలపై దాడులకు పాల్పడటం, ఆస్తులను నష్టపర్చడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, పార్టీ కార్యకర్తలకు అందరూ అందుబాటులో ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద పార్టీ సీనియర్ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగాక గెలుపోటములను దగ్గరగా చూసిందని చెప్పారు. కానీ, ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. కేవలం కార్యకర్తలపై దాడులేకాకుండా పార్టీ జెండా దిమ్మెలు, విగ్రహాలను ధ్వంసం చేసే ప్రక్రియకు కూడా తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. ఇది అప్రజాస్వామికమని ఆయన అన్నారు.













