పిల్లలకు పాలిస్తే తల్లికీ ఆరోగ్యమే!
తల్లిపాలు పిల్లలకు ఆరోగ్యమని వింటూనే ఉంటాం. అయితే, పిల్లలకు పాలివ్వడం తల్లికీ ఆరోగ్యమేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. బిడ్డకు పదిహేను నెలలపాటు పాలిచ్చిన తల్లులకు మల్లిపుల్ స్కెలారిసిస్ (ఎంఎస్) వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుందని కాలిఫోర్నియా పరిశోధకులు పేర్కొన్నారు. శరీర రోగ నిరోధక వ్వవస్థ కారణంగా మెదడు, వెన్నెముకలలో ఉండే నాడీ కణాల పొరలు కరిగిపోవడానికి మల్టిపుల్ స్కెలారిసిస్ వ్యాధిగా వ్యవహరిస్తారు. ఇక రొమ్ము, అండాశయ కేన్సర్లు, మధుమేహం, గుండెపోటు తదితర వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుందని వివరించారు.













