ఒక్కసారి అలాంటి అవకాశం ఇవ్వాలి
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమించినట్టు తెలిసి ఆయన మేనకోడలు కాంతి మిశ్రా కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మళ్లీ కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై మీడియా ఆమెను వాకబు చేయగా, నిన్న నా కుమారు ఎయిమ్స్ వెళ్లి రోజంతా అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు అతడు నాతో చెప్పాడు. ఆయన మళ్లీ కోలుకుని ప్రజల ముందుకొచ్చి మాట్లాడితే చూడాలని ఉంది. ఒక్కసారి అలాటి అవకాశం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కంటతి పెట్టారు. వాజ్‌పేయి జ్ఞాపకాలను మనుసుల్లో నుంచి తుడిచివేయడం తమ కుటుంబానికి సాధ్యం కాదన్నారు.













