ఫస్ట్ లేడీ అవార్డు అందుకున్న ఐష్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఫస్ట్ లేడీ అవార్డును అందుకున్నారు. రెండు దశాబ్దాలుగా సినీరంగానికి ఆమె అందిస్తున్న సేవలకు గానూ ఈ అవార్డును ఎంపిక చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. పలు రంగాల్లో ఘనవిజయాలు సాధించిన మరికొంతమంది మహిళలకు కూడా ఈ ఫస్ట్‌లేడీ అవార్డులను అందజేశారు. 2002 నుంచి ప్రతీ సంవత్సరం కేన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరవుతున్న ఐశ్యర్య ఇటీవల ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఐష్‌ను సత్కరించారు. ఐష్‌తో పాటు చిన్న వయసులోనే పైలెట్ అయినా ఆయేషా అజీజ్, తొలి మహిళా ఐపీఎస్ రువేదా సలామ్‌లతో పాలు మరో 113 మందికి అవార్డు ప్రదానం చేశారు.













