ఈ సూపర్ హిట్ జోడీతో సినిమా ?….
ఇటీవల మజిలీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు నాగచైతన్య, సమంత. ఏ మాయ చేసావే దగ్గర నుంచి మజిలీ వరకు ప్రతి సినిమాలోనూ వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోతూనే ఉంది. ఈ సూపర్ హిట్ జోడీతో ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే చైతూకు ఈ కథను వినిపించాడట. అది చైతూకు బాగా నచ్చేసింది. ఇందులో సమంత కథానాయిక అయితే బాగుంటుందని అజయ్ భావిస్తున్నాడు. చైతూకు చెప్పినప్పుడు సమంత కూడా ఈ కథ విన్నదని తెలిసింది. ఆ సమయంలోనే ఈ సినిమాలో నటించడానికి సమంత ఆసక్తి చూపించిందట. అన్నీ కుదిరితే అజయ్ భూపతి సినిమాలో వీరిద్దరీని మరోసారి జంటగా చూసేయవచ్చు.













