డిట్రాయిట్ లో తానా ప్రచారసభ సక్సెస్
వాషింగ్టన్డీసిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) జులై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే 22వ మహాసభలను పురస్కరించుకుని డిట్రాయిట్లో జరిగిన ప్రచార కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల చైర్మన్ డా.కొడాలి నరేన్ హాజరయ్యారు. తానా 22వ మహాసభలను తెలుగువారు గర్వించేలా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. తానా ప్రాంతీయ ప్రతినిధి సునీల్ పంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు డా.బండ్ల హనుమయ్య, తానా సభ్యులు యార్లగడ్డ శివరాం, నిరంజన్ శంగవరపు, వెలగా శుభకర్, పెద్దిబోయిన జోగేశ్వరరావు, కిరణ్ దుగ్గిరాల, వంశీ కారుమంచి, బచ్చు సుధీర్, సాగర్ మారెంరెడ్డి, సినీ నిర్మాత నవీన్ యెర్నేని, ఆటా తరఫున వినోద్ కుకునూర్ ఇతర తానా అభిమానులు, తెలుగు ప్రముఖులు ాల్గొన్నారు.













