తానా మహాసభలు.. వివిధ రకాల పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలను ఈసారి వాషింగ్టన్ డీసిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిదే. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ 22వ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహాసభల లోగో, మహాసభల వెబ్సైట్ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలతోపాటు వివిధ నగరాల్లో ఉన్న తానా సభ్యులను, ఇతర తెలుగుప్రముఖులను భాగస్వాములను చేసేందుకు వీలుగా వివిధ రకాల పోటీలను కూడా తానా ఏర్పాటు చేసింది. ధీం తానా పేరుతో వివిధ నగరాల్లో సింగిరగ్, గ్రూపు డ్యాన్సింగ్, కపుల్ డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పేరుతో పోటీలను ఏర్పాటు చేసింది. బే ఏరియాలో బాటా ఉగాది వేడుకల్లో ఈ ధీం తానా పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ నగరాల్లో పోటీలను నిర్వహించిన తరువాత ఫైనల్స్ పోటీలను తానా మహాసభల వేదికపై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ ధీంతానాకు చైర్‌పర్సన్‌గా సాయిసుధ పాలడుగు వ్యవహరిస్తున్నారు.
క్యూరీ సంస్థతో కలిసి తానా చిన్నారులకు మ్యాథ్, సైన్స్ సబ్జెక్టులో పోటీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మ్యాథ్ బౌల్ పేరుతో గణితంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, సొంతపద్ధతిలో పరిష్కారాన్ని వెదకడం వంటివి ఈ పోటీల ద్వారా చిన్నారులకు తెలియజేయనున్నది. తానా సైన్స్ బౌల్ పేరుతో సైన్స్‌లో వారి ప్రతిభను పెంచే విధంగా పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలను 3 గ్రూపులుగా విభజించింది. గ్రూపు 1లో గ్రేడ్స్ 2-3, గ్రూప్ 2లో గ్రేడ్ 4-5, గ్రూపు 3లో గ్రేడ్ 6-7 పేరుతో ఏర్పాటు చేసింది. క్యూరీ-తానా స్పెల్ మాస్టర్ ఛాలెంజ్, క్యూరీ కోడ్ ఛాలెంజ్ పేరుతో కూడా పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను చూడగలరు. http://www.curielearning.com/tana/
మహాసభలను పురస్కరించుకుని తానా ఆటల పోటీలను కూడా ఏర్పాటు చేసింది. వాలీబాల్, బ్యాడ్మింటన్, యూత్ క్రికెట్, త్రో బాల్, చెస్, టాప్ గోల్ఫ్, పోకర్ ఫండ్రైజర్, రన్నింగ్, టెన్నిస్, క్రికెట్ వంటి పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలకు తానా మహాసభల https://www.tana2019.org/ వెబ్‌సైట్‌ను చూడండి.













