అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న శబరిమల ఆలయం
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నేడు (శుక్రవారం) తెరుచుకుంది. ఉత్రం పండుగ నేపథ్యంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల 28వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. అయితే ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేశారు. ఆన్లైన్లో దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు, నిత్యం పదివేల మంది చొప్పున అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్కోర్ బోర్డు పేర్కొంది. ఆర్టీ పీసీఆర్ కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.













